ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం
*ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఇంగ్లీషు మీడియం పై నా ఆలోచన*
అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టండి
కానీ....
ఓ తెలుగు తల్లి బిడ్డ గా నా అభిప్రాయాలుకు విలువ ఇవ్వండి
*ఇది ఒక పరిష్కారం అవుతుందని భావించండి*
ఇది తెలుగు వాడిగా నా డిమాండ్
పాఠశాలలో తెలుగు ఒక సబ్జెక్టు గా మాత్రమే కాదు..... ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా తెలుగు మాత్రమే మాట్లాడాలని నిబంధనవిధించచండి.
పాఠశాల లో తెలుగు తనం కనిపించేలా చెయ్యండి.
పాఠశాల పేరు, అన్ని రికార్డులు తెలుగు లోనే ఉండాలి.
ఇకపై ఈ ఆంధ్ర దేశంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు కనిపించాలి. షాపు ల పేర్లు కూడా ఖచ్చితంగా తెలుగు లో ఉండేలా చేయండి.
ప్రతి విద్యార్థి కి తెలుగు అవసరం అడుగడుగునా కనిపించాలి. అప్పుడే తెలుగు భాష అంతరించిపోకుండా ఉంటుంది.
నేను తెలుగు మీడియం లో ఇంగ్లీషు ఒక సబ్జెక్టు గా చదివాను. ఇంగ్లీషు అవసరం కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను ఇంగ్లీషు ని నెగ్లెట్ చేసాను.
కొందరు ఇంగ్లీషు మీడియం మితృలు "మాకు అస్సలు తెలుగు రాదు" అన్నట్లు ప్రవర్తించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను.
తెలుగు భాష మన మాతృభాష అంటే అమ్మ భాష. అమ్మ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అమ్మ భాష మీద కూడా అంతే ప్రేమ ఉండాలి. అటువంటి తెలుగు భాష అంతరించిపోకుండా మీరే చర్యలు తీసుకోవాలి.
ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగు నెగ్లెట్ చేసే అవకాశం ఉంది.
కొన్ని పాఠశాలల్లో పూర్తి ఇంగ్లీషు లో లేదా ఏ ఇతర భాషలో మాట్లాడాలని నిబంధన విధిస్తే వారి పట్ల చర్యలు తీసుకోండి.
వారంలో ఒక రోజు తెలుగు భాష పై మక్కువ పెరిగేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
అనగా నో బ్యాగ్ డే వలె తెలుగు నాటికలు, పద్యగాధలు వంటివి ప్రతి వారం లో ఒక రోజు ఖచ్చితంగా నిర్వహించాలి.
సినిమా లో సబ్ టైటిల్స్ కూడా తెలుగు లోనే ఉండాలి.
ఇలా చేస్తే నేను ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తాను.
అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష ను బ్రతికించండి.
తెలుగు భాష అంతరించిపోతే తల్లిదండ్రులు స్వర్గస్థులు అయినట్లే....
🙏🙏🙏
ఇట్లు
యన్ వెంకట్ రాఘవ
NVR entertainments
7729013094
Kommika village Koyyuru mandal
Visakhapatnam district
Super
రిప్లయితొలగించండిExellent
రిప్లయితొలగించండిMind blowing
రిప్లయితొలగించండి