మహాగంగా జలపాతం

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామం లో ఈ జలపాతం ఉంది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని రంప ను పోలి ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ అందాలు అద్భుతం అమోఘం అపూర్వం. విహారయాత్రకు విశాఖపట్నం జిల్లా అనువైన ప్రదేశం.

కొమ్మిక పంచాయతీ లో ఈ జలపాతం ఒక అద్భుతం. కొమ్మిక గ్రామానికి కిలో మీటరు దూరంలో ఈ జలపాతం ఉంది. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ జలపాతం వెలుగు లోకి రాలేదు. వాహనాలు రోడ్డు కు సమీపంలో నిలిపి, పావు కిలో మీటరు దూరం కొండ ఎక్కాలి అందువల్ల కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. అయినప్పటికీ ఎంతో మంది దీన్ని వీక్షించి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా గడిపేందుకు ఇది చాలా మంచి ప్రదేశం. అందువల్లనే ఏమో ఎంతో మంది దీన్ని ఇష్టపడుతున్నారు. కుదిరితే మీరు కూడా వీక్షించి తరించండి.
ఈ జలపాతం యెక్క చిత్రాలు , వీడియోలు అందుబాటులో ఉన్నాయి. 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గణతంత్ర దినోత్సవం

కాలం రాబోతోంది...

డోలీ మోతకు చెక్