నాటుసారా నిషేదమే లక్ష్యం

 విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు మండలం లో డ్వాక్రా మహిళలు , వాలంటీర్లు నాటుసారా పై కన్నెర్ర చేసారు. నాటుసారా తయారీ కేంద్రాలు ధ్వంసం చేసి, వంటపాత్రలు స్వాధీనం చేసుకున్నారు. మండలం లో కొమ్మిక పంచాయతీ లో నాటుసారా నిర్మూలన కోసం కర్ణిక పాలెం,రేవళ్శు , డేగలపాలెం గ్రామాల్లో  మహిళలు యువకులు ర్యాలీ నిర్వహించి మద్యం నిర్మూలన చెయ్యాలి అని నినాదాలు చేశారు. ఎన్ని సార్లు నాటుసారా విక్రయాలు జరపొద్దని చెప్పినా విక్రయదారులు వినలేదని, అందుచేత ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం ఎక్కువగా లభ్యం అవుతుంది అని దీనిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు కోరారు. అతి త్వరలో పంచాయతీ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి మద్య నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు లక్ష్మణ్, సింహాచలం , డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు
వార్తా పత్రికల్లో

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం