కొత్త సంవత్సరం - గణిత అద్భుతం

విశాఖ ఏజెన్సీ: తూర్పు గోదావరి జిల్లా లోని ఓ అధ్యాపకుడు గణిత విన్యాసం ద్వారా అందరినీ అలరించారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్),బొమ్మూరు (రాజమహేంద్రవరం) కు చెందిన ఈ అధ్యాపకులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులకు గణితం బోధిస్తూ, గణితం లో తనదైన ప్రత్యేకతను చూపించి అందరినీ అబ్బుర పరుస్తారు. తాజాగా ఆయన కొత్త సంవత్సరం 2020 కి సంబంధించి చేసిన ఈ గణిత అలంకారం అందరినీ ఆకట్టుకుంటుంది.

12³+√4+56+(78×√9)=2020

1+2+345×6-7×8+√9=2020

2⁽¹⁺²⁺³⁺⁴⁺⁵⁺⁶⁺⁷⁻⁽⁸⁺⁹⁾-(1+2+3+4+5+6+7)=2020


వరుస అంకెల మధ్య గణిత గుర్తులు ఉపయోగించి పరిక్రియ జరిపిన తర్వాత 2020 వచ్చేలా అంకెలు, గుర్తులు అమర్చి, గణిత ప్రియులను ఉత్సాహపరిచారు. గణితం పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని గణిత విన్యాసాలు ద్వారా చూపుతున్నారు. 
అంతే కాకుండా ఈయన తయారు చేసిన గడియారం అందరినీ ఆలోచింపచేసింది.

2020 లో గల 2,0,2,0 అంకెలను వరుసగా వచ్చేలా తీసుకుని గణిత గుర్తులు ఉపయోగించి వాటి మధ్య పరిక్రియ జరిపితే గడియారం లో ఉండే 1,2,3,4,5,6,7,8,9,10,11,12 వచ్చేలా అంకెలు, గుర్తులు అమర్చి గడియారం - 2020 ను తయారు చేసారు.

            కె వి ఎస్ గడియారం - 2020


2⁰+2×0=1
2+0+2×0=2
2+0!+2×0=3
2+0+2+0=4
2+0+2+0!=5
2+0!+2+0!=6
(2+0!)×2+0!=7
(2+0!)!+2+0=8
(2+0!)×(2+0!)=9
20÷2+0=10
20÷2+0!=11
(2+0!)!×2+0=12



గణితం పై ఆసక్తి పెంచేందుకు ఇటువంటి గణిత విన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయి. సరదాగా ప్రయత్నం చేసానని, ఆలోచిస్తే గణితం లో మరెన్నో అద్భుతాలు చెయ్యవచ్చు అని అధ్యాపకులు కొమ్ముల వెంకట సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు.

ప్రముఖ సంఖ్యల సిద్ధాంత నిపుణులు 
కొమ్ముల వెంకట సూర్యనారాయణ గారు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం