రాత్రి బడులు నిర్వహించాలి
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామస్తులు రాత్రి బడులు నిర్వహించాలి అని గ్రామ సచివాలయం లో వినతి పత్రం సమర్పించారు. ఆధునిక ప్రపంచంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కనీస విద్యా పరిజ్ఞానం కలిగి ఉండాలి. కొమ్మిక పంచాయతీ లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉన్నారు. అందువల్ల నిరక్షరాస్యులు అయిన మహిళలు, యువకులు, వృద్ధులకు రాత్రి బడులు నిర్వహించి వారికి విద్య పై అవగాహన కల్పించాలని, నిలిపి వేసిన సాక్షర భారత్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినతి పత్రం తీసుకున్న గ్రామ సచివాలయం సిబ్బంది పై అధికారులకు తెలియజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
వివిధ వార్తా పత్రికల్లో....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి