గిరిజన ప్రాంతాలు - బాల్యవివాహాలు

*బాల్యవివాహాలు అరికట్టాలి*

మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో ప్రజలు నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. బాల్యవివాహాలు వల్ల కలిగే నష్టాలు తెలియకపోవడం వల్ల పలు గ్రామాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆడపిల్లలకు బలవంతంగా వివాహం జరిపిస్తున్నారు. చదువు మాన్పించి బాల్యవివాహాలు చేసేస్తున్నారు కొందరు అజ్ఞాన గిరిజనులు . ఈ ప్రాంతాలను అధికారులు ప్రజాప్రతినిధులు సరిగ్గా పట్టించుకోవడం లేదు. పదవతరగతి పూర్తి కాకుండానే కొందరికి పెళ్ళిళ్ళు జరిగిపోతుంటే, పదవతరగతి పూర్తికాగానే మరికొందరి వివాహాలు జరిగిపోతున్నాయి. 18 ఏళ్ళు నిండిన తర్వాతే పెళ్లి జరగాలి. కానీ మన్యం లో ఇలా జరగడం లేదు. అతి తక్కువ వయస్సులోనే పిల్లలను కంటున్నారు. దాని వల్ల తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రమాదమే. అంతే కాకుండా మహిళల పై అత్యాచారాలు ఏజెన్సీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. బాధితులు నిరక్షరాస్యులు, నిరుపేదలు, చట్టాలపై అవగాహన లేని వారు కావడంతో కామాంధుల వేషాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నలుగురు లో పరువు పోగొట్టుకోవడం కన్నా మౌనంగా ఉండటమే మేలు అనే భయాందోళనకరమైన భావం మహిళలను వెనక్కి తగ్గేలా చేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కనీసం ఇంటర్మీడియట్ వరకూ అయినా ఖచ్చితంగా చదివేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వం దీని పట్ల బాధ్యత వహించాలి. ప్రతి పంచాయతీలో లైబ్రరీ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాత్రి బడులు నిర్వహించి, గిరిజన ప్రజలను విజ్ఞాన వంతులను చెయ్యాలి.

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి..

ముఖ్యంగా మహిళల ఆలోచనా విధానం మారేలా తగిన తర్ఫీదు ఇవ్వాలి..

చదువుకున్న ప్రతీ గిరిజనుడు ఉద్యోగం కోసం, పట్టణ ప్రాంతానికి వెళ్తున్నారే తప్ప తన సొంత గ్రామంలో ఉండే ప్రాథమిక సమస్యలు కూడా గుర్తించి నిరక్షరాస్యులకి కనీస అవగాహన కూడా కల్పించడం లేదు ..

ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమే కాదు...మనది కూడా...

మన ఆలోచన విధానం మారాలి..
అందరికీ  అవగాహన కల్పించాలి...

ఇది బరువు గా కాదు..బాధ్యతగా భావించాలి...

కామెంట్‌లు

  1. Yes..

    చదువుకున్న యువకులు ఉద్యోగం, జీతం పైనే శ్రద్ధ చూపుతున్నారు తప్పించి , సమాజం పట్ల కనీస బాధ్యత వహించడం లేదు..మనం చదుకున్న,తెలుసున్న జ్ఞానం స్వంత గ్రామాల్లో ఉండే వారికైనా ఉపయోగపడితే మన చదువుకో అర్థం ఉంటుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం