పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

రాత్రి బడులు నిర్వహించాలి

చిత్రం
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామస్తులు రాత్రి బడులు నిర్వహించాలి అని గ్రామ సచివాలయం లో వినతి పత్రం సమర్పించారు. ఆధునిక ప్రపంచంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కనీస విద్యా పరిజ్ఞానం కలిగి ఉండాలి. కొమ్మిక పంచాయతీ లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉన్నారు. అందువల్ల నిరక్షరాస్యులు అయిన మహిళలు, యువకులు, వృద్ధులకు రాత్రి బడులు నిర్వహించి వారికి విద్య పై అవగాహన కల్పించాలని, నిలిపి వేసిన సాక్షర భారత్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని గ్రామస్తులు  కోరుతున్నారు. వినతి పత్రం తీసుకున్న గ్రామ సచివాలయం సిబ్బంది పై అధికారులకు తెలియజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. వివిధ వార్తా పత్రికల్లో....

అలరించిన ఆర్టిస్ట్

చిత్రం
రాజు పెన్సిల్ ఆర్ట్స్ romeoraju70@gmail.com తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి చెందిన రాజు అనే యువకుడు తన ప్రతిభను చాటుకున్నారు. సంప్రదించండి ఇలా...... https://youtu.be/_bd6X2tGxM8 https://youtu.be/_bd6X2tGxM8

ఘనంగా గణతంత్ర దినోత్సవం

చిత్రం
కొమ్మిక లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ సందర్భంగా పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొమ్మిక గ్రామం లో తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దైవ సమానులైన చిన్న పిల్లలతో జాతీయ పతాక ఆవిష్కరణ చేయించారు.  భారతీయ పౌరులైన మన అందరం దేశభక్తి ని కల్గి ఉండాలి అని వాలంటీర్ రాజు బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. https://youtu.be/OaIpjm8sDEI https://youtu.be/OaIpjm8sDEI