DONATE a meal for NEEDY- phase 1

కరోనా మహమ్మారి వలన పస్తులుంటున్న ఎందరో పేదవారికి,

అగ్గి లాంటి ఎండ ధాటికి ఎటు పోవాలో తెలీని..నిలువ నీడ లేని నిర్భాగ్యులకి,

ఇప్పుడు తింటే మళ్లీ ఎప్పుడు తింటామో తెలియని అభాగ్యులకి,

దేశ సేవ లో నిమగ్నమైన పోలీసులకి, sanitary సిబ్బందికి,

*Phase - 1గా  ఈరోజు మన డైట్ కామ్రేడ్స్ తరపున ఒక చిన్న ప్రయత్నం ద్వారా రాజమండ్రిలో  28 మందికి వెజ్ బిర్యాని, ఆలూ కుర్మా, మజ్జిగ, బిస్కెట్ పాకెట్స్ అందించడమైనది*

ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం...

*ఈపూట బానే గడిచింది అని సంతోష పడుతూనే, ఇంకొక పూట ఎలా గడుస్తుందో అని బాధ పడుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు..*

*తమ కష్టాన్ని నమ్ముకున్న రోజు వారి కూలీలు, ఆత్మాభిమానం తో బ్రతికే కార్మికులకు మాత్రం ఏం తెలుసు ఇటువంటి గడ్డు కాలం వస్తుందని...*!

*తమ ఆకలి తీర్చడానికి ఎవరో వస్తారు..తినడానికి ఏదో ఇస్తారు అని ఆత్మాభిమానాన్ని చంపుకుని  ఎదురు చూసే రోజులను తెస్తుందని...*!!

ఆకలి వల్ల ఆత్మాభిమానాన్ని చంపుకున్న వారు కొందరైతే,
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆకలితో బాధ పడే వారు ఇంకొందరు....


వీళ్లంతా ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా... ఎక్కడో కాదు..  ఈ *సమాజం* లోనే ఉన్నారు...
*మీరు బ్రతుకుతున్న ఈ సమాజం లోనే ఉన్నారు*...

రండి..! తలో చెయ్యి వేద్దాం...
ఆకలి అనే భూతాన్ని అందరం కలిసి తరిమికొడదాం...!!

లేని వాడికి అన్నం పెడదాం..!
మనం ఉన్నామని భరోసానిద్ధాం..!!

🙏🙏🙏









కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం