కొనసాగుతున్న భోజన పంపిణీ

రాజమండ్రి: కరోనా వైరస్ దృష్ట్యా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ వల్ల రోజూ కూలీలు, నిరాశ్రయులు, అనాధలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. దీనిని గమనించిన డైట్ బొమ్మూరు పూర్వ విద్యార్థులు వారి ఆకలి తీర్చేందుకు, భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ కార్యక్రమం గత కొద్ది రోజులుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో DONATE A MEAL FOR NEEDY పేరుతో జరుగుతుంది. తాజాగా సోమవారం రాజమండ్రి లో ఆకలి తో బాధపడుతున్న నిరాశ్రయులకు, అనాధలకు, కార్మికులకు భోజన పంపిణీ చేసినట్లు డైట్ పూర్వ విద్యార్దులు హరీష్, వెంకట్ రాజు తెలిపారు. విరాళాలు సేకరించి ఈ కార్యక్రమం చేస్తున్నామని, అందరూ చాలా బాగా సహకరిస్తున్నారని, ఈ కార్యక్రమం మాకు ఎంతో తృప్తిని ఇస్తుంది అని వారు అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం