పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Donate a meal for NEEDY foundation - phase 2

చిత్రం
ఎవ్వరికి ఎప్పుడు ఏ రూపం లో కష్టం వస్తుందో ఎవ్వరికీ తెలీదు.... రోజు కూలీ చేసుకుంటూ, తమ కష్టార్జితాన్ని నమ్ముకుని, పూట గడుపుకునే నిర్భాగ్యులు... ఆత్మాభిమానం తో బ్రతికే సాటి మనుషులు.... పాపం వారికేం తెలుసు... అలాంటి వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రూపంలో ఎన్నడూ గ్రహించనీ ఆకలి బాధలను తెస్తుందని..! పాపం వారికేం తెలుసు.. గృహ నిర్భంధం సమాజ క్షేమం కోసం అయినా, వారి బ్రతుకులను దుర్బరం చేస్తుందని...!! అది *అనపర్తి దగ్గర రామవరం అనే గ్రామం...అక్కడ అందరూ రోజు కూలీలు, శ్రామికులు*... *వారికి కరోనా మహమ్మారి ఆకలి బాధలను  తెస్తుందని ఎప్పుడూ అనుకోలేదు....* *వారి ఆకలి బాధలను తెలుసుకుని Phase- 2 గా అక్కడ ఉండే 130 మంది కూలీలకు ఈరోజు మన డైట్ కామ్రెడ్స్ తరపున ఆకలి తీర్చడం జరిగింది* దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు ... 🙏🙏🙏

DONATE a meal for NEEDY- phase 1

చిత్రం
కరోనా మహమ్మారి వలన పస్తులుంటున్న ఎందరో పేదవారికి, అగ్గి లాంటి ఎండ ధాటికి ఎటు పోవాలో తెలీని..నిలువ నీడ లేని నిర్భాగ్యులకి, ఇప్పుడు తింటే మళ్లీ ఎప్పుడు తింటామో తెలియని అభాగ్యులకి, దేశ సేవ లో నిమగ్నమైన పోలీసులకి, sanitary సిబ్బందికి, *Phase - 1గా  ఈరోజు మన డైట్ కామ్రేడ్స్ తరపున ఒక చిన్న ప్రయత్నం ద్వారా రాజమండ్రిలో  28 మందికి వెజ్ బిర్యాని, ఆలూ కుర్మా, మజ్జిగ, బిస్కెట్ పాకెట్స్ అందించడమైనది* ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం... *ఈపూట బానే గడిచింది అని సంతోష పడుతూనే, ఇంకొక పూట ఎలా గడుస్తుందో అని బాధ పడుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు..* *తమ కష్టాన్ని నమ్ముకున్న రోజు వారి కూలీలు, ఆత్మాభిమానం తో బ్రతికే కార్మికులకు మాత్రం ఏం తెలుసు ఇటువంటి గడ్డు కాలం వస్తుందని...*! *తమ ఆకలి తీర్చడానికి ఎవరో వస్తారు..తినడానికి ఏదో ఇస్తారు అని ఆత్మాభిమానాన్ని చంపుకుని  ఎదురు చూసే రోజులను తెస్తుందని...*!! ఆకలి వల్ల ఆత్మాభిమానాన్ని చంపుకున్న వారు కొందరైతే, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆకలితో బాధ పడే వారు ఇంకొందరు.... వీళ్లంతా ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా... ఎక్క...

donate a meal for NEEDY... thanks

🌱🌱🌱 మేము చేపట్టిన ఈ *Donate a meal* కార్యక్రమానికి మీ స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.. *మీ స్పందన ఖచ్చితంగా ఎంతో మంచి అన్నార్తుల ఆకలి తీర్చుతుంది* విద్యార్థులుగా మేము చేస్తున్న  ఈ మొదటి ప్రయత్నానికి తమ వంతు  సహాయంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తున్న *బంధు మిత్రులకు, మాలో మానవతా విలువలు నింపిన ఉపాధ్యాయులకు, ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు* తెలుపుతున్నాము. 🙏🙏🙏 మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి.. మనమందరం కలిసి కొంత మంది ఆకలినైన తీర్చుదాం..   మనిషికి రూపం మానవత్వమే అని మరొక్కసారి నిరూపిద్ధాం.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశం ఉన్నప్పుడు, ఒకరి కడుపు నింపడం *దేశ పౌరులుగా* గా మన బాధ్యత.. ఇదే మానవ సేవ, దేశ సేవ 🌱🌱🌱

DONATE A MEAL FOR NEEDY CONCEPT

మిత్రులకు మనవి...🙏🙏🙏 కరోనా వైరస్ తో బాధపడే వారి కంటే, ఈ వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ వల్ల పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువయ్యింది. అందుకోసం కొంత మందికైనా ఆకలిని తీర్చి, కడుపు నింపే ప్రయత్నంగా *భోజన పంపిణీ* కార్యక్రమాన్ని  చేపడుతున్నాం.. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.. నీ సహాయం చిన్నదైనా, ఆ చిన్న సహాయం కోసం అల్లాడిపోతున్న ప్రాణాలెన్నో... ఇందుకు సాయంగా మీరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు... ఎందుకంటే, ఇక్కడ సహాయం చేసేది .. నువ్వు కాదు "మనం - మనమందరం" మనం చేసే ఈ సహాయం ఎంతోమంది  *అనాధలు, వృద్ధులు, కార్మికుల* కడుపులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. మీరు గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు.. గూగుల్ పే/ ఫోన్ పే నంబర్: 9121749499 Bank Name: Andhra Bank A/c no: 094110100050349 Branch: RAMAVARAM IFSC code: ANDB0000941 ఆర్గనైజేషన్ చేయువారు:  డైట్ బొమ్మూరు, 2017-19 బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులు Contact numbers: 7997292264 ,  9347750021 "ప్రార్థించే పెదవుల కన్నా , సహాయం చేసే చేతులు మిన్న" 🌱🌱🌱

కొనసాగుతున్న భోజన పంపిణీ

చిత్రం
రాజమండ్రి: కరోనా వైరస్ దృష్ట్యా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ వల్ల రోజూ కూలీలు, నిరాశ్రయులు, అనాధలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. దీనిని గమనించిన డైట్ బొమ్మూరు పూర్వ విద్యార్థులు వారి ఆకలి తీర్చేందుకు, భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ కార్యక్రమం గత కొద్ది రోజులుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో DONATE A MEAL FOR NEEDY పేరుతో జరుగుతుంది. తాజాగా సోమవారం రాజమండ్రి లో ఆకలి తో బాధపడుతున్న నిరాశ్రయులకు, అనాధలకు, కార్మికులకు భోజన పంపిణీ చేసినట్లు డైట్ పూర్వ విద్యార్దులు హరీష్, వెంకట్ రాజు తెలిపారు. విరాళాలు సేకరించి ఈ కార్యక్రమం చేస్తున్నామని, అందరూ చాలా బాగా సహకరిస్తున్నారని, ఈ కార్యక్రమం మాకు ఎంతో తృప్తిని ఇస్తుంది అని వారు అన్నారు.

DONATE A MEAL FOR NEEDY TEAM - THANKS TO JVS BHASKAR

చిత్రం
JVS BHASKAR about DONATE A MEAL మేము చేస్తున్న DONATE A MEAL FOR NEEDY కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, మరింత విజయవంతం కావాలని, మోటివేషనల్ స్పీకర్ (Impact) శ్రీ జె.వి.యస్ భాస్కర్ గారు తన కొత్త యూట్యూబ్ చానల్ ద్వారా వ్యక్తం చేశారు. మనం చేస్తున్న మంచి పనికి ఇంత గొప్ప ఆదరణ లభించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే ఉత్సాహంతో మరింత మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తాము. మీ అందరి సహకారం వల్లే, మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతున్నాము. ఇకపై కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మరింత మంది సహకారం అవసరం. అందుకోసం మనం ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేసి, *అన్నార్తుల ఆకలి తీర్చుదాం... కూలీల కడుపులు నింపుదాం...* మానవత్వమే మనిషికి రూపం.. మనిషి గా మరో మనిషికి సాయం చేద్దాం... YouTube  అన్నార్తులను ఆదుకుందాం... మానవత్వం చాటుకుందాం... 🙏🙏🙏 Please support us...

DONATE A MEAL FOR NEEDY

చిత్రం
కరోనా వైరస్ తో బాధపడేవారికంటే, దాని ప్రభావం తో పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది.  లాక్ డౌన్ కారణంగా మనం ఎవ్వరం, బయటకు రావడం లేదు... ఏ పనీ చేయటం లేదు... దీనివల్ల అన్నార్తులు, అనాధలు, రోజూ కూలీలు, నిరాశ్రయులు తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు.  ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి కడుపు నింపేందుకు చేస్తున్న కార్యక్రమమే, DONATE A MEAL FOR NEEDY కేవలం మేము మాత్రమే దీనిని విజయవంతం చేయలేము... దీనికి మీ అందరి సహకారం కావాలి... 🙏🙏🙏 మీరు చేసే సహాయం ఎంతో మంది అనాధలు, వృద్ధులు, కార్మికుల కడుపులు నింపుతుంది...   సహాయం చేద్దాం ఇలా:- Google Pay/ phone Pay number: 9121749499 Bank name: Andhra Bank A/c no: 094110100050349 Branch: RAMAVARAM IFSC Code: ANDB0000941   సంప్రదించండి ఇలా:- 7997292264 (రాజశేఖర్) , 9347750021 (త్రినాథ్) https://youtu.be/vgtqccw4Iuw