పరీక్షలకు వేళాయెరా....
విశాఖ ఏజెన్సీ: విద్యా సంవత్సరం చివరిదశకు వచ్చేసింది. విద్యార్థులు ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నారో పరీక్షించుకని, వారి సామర్థ్యాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైంది. దాదాపుగా అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కావస్తోంది. కళాశాలల్లో అయితే సిలబస్ పూర్తి చేసి ఉంటారు. మరికొద్ది రోజుల్లో పదవతరగతి పిల్లలు, వారి జీవితం లో మెదటి పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొనబోతున్నారు. అతి త్వరలో పరీక్షలు కావడంతో, పదవతరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. సమయం వృధా చేయకుండా, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దాదాపుగా అన్ని కోర్సుల వారికి పరీక్షలకు వేళాయెను. కానీ, డి.ఎడ్ చదివే వారికి మాత్రం ప్రాక్టికల్ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదు. కాబోయే ఉపాధ్యాయులు అయిన డి.ఎడ్ విద్యార్థులు విద్యాశాఖకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, సక్రమంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఛాత్రోపాధ్యాయులు వాపోతున్నారు.
Haaa
రిప్లయితొలగించండి