NVR entertainments విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దిగువ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది వేసవి కాలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. వేసవి కాలం లో పండే "జీడి మామిడి" పంట వీరికి ప్రధానమైనది చెప్పవచ్చు. జీడి మామిడి పంట పై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ వేసవిలో సంపాదించిన దానితోనే సంవత్సరం మొత్తం గడుపుతారు. దళారీల వద్ద అప్పులు చేసి గిరిజన ప్రజలు బ్రతుకుతున్నారు. 2018 వరకు వీరి జీవనం బాగానే గడిచింది. గత ఏడాది జీడి పిక్క ధర అందరినీ నిరాశ పరిచింది. ఎన్నో కుటుంబాలు అప్పులపాలై గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం విశాఖ మన్యం దిగువ ప్రాంతంలో కనిపిస్తుంది. జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్న, జీడిపప్పు ఉండే పిక్క ధర మాత్రం గత ఏడాది జీడి మామిడి రైతులు అందరినీ నిరాశ పరిచింది. దీనికి కారణం గత ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు కారణంగా ప్రభుత్వం లేకపోవడం వలన అని అభిప్రాయపడి, మల్లీ ఈ సంవత్సరం కూడా జీడి మామిడి పంట సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు దిగువ ఏజెన్సీ రైతులు. "రైతు దేశానికి వెన్నెముక అంటారు" కానీ, ఆ రైతుల కష్టాలు మాత్రం ఎవ్వర...
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామం లో ఈ జలపాతం ఉంది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని రంప ను పోలి ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ అందాలు అద్భుతం అమోఘం అపూర్వం. విహారయాత్రకు విశాఖపట్నం జిల్లా అనువైన ప్రదేశం. కొమ్మిక పంచాయతీ లో ఈ జలపాతం ఒక అద్భుతం. కొమ్మిక గ్రామానికి కిలో మీటరు దూరంలో ఈ జలపాతం ఉంది. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ జలపాతం వెలుగు లోకి రాలేదు. వాహనాలు రోడ్డు కు సమీపంలో నిలిపి, పావు కిలో మీటరు దూరం కొండ ఎక్కాలి అందువల్ల కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. అయినప్పటికీ ఎంతో మంది దీన్ని వీక్షించి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా గడిపేందుకు ఇది చాలా మంచి ప్రదేశం. అందువల్లనే ఏమో ఎంతో మంది దీన్ని ఇష్టపడుతున్నారు. కుదిరితే మీరు కూడా వీక్షించి తరించండి. ఈ జలపాతం యెక్క చిత్రాలు , వీడియోలు అందుబాటులో ఉన్నాయి. https://youtu.be/he-TIs1lYQY https://youtu.be/V-5beoVkuo0
*ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఇంగ్లీషు మీడియం పై నా ఆలోచన* అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టండి కానీ.... ఓ తెలుగు తల్లి బిడ్డ గా నా అభిప్రాయాలుకు విలువ ఇవ్వండి *ఇది ఒక పరిష్కారం అవుతుందని భావించండి* ఇది తెలుగు వాడిగా నా డిమాండ్ పాఠశాలలో తెలుగు ఒక సబ్జెక్టు గా మాత్రమే కాదు..... ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా తెలుగు మాత్రమే మాట్లాడాలని నిబంధనవిధించచండి. పాఠశాల లో తెలుగు తనం కనిపించేలా చెయ్యండి. పాఠశాల పేరు, అన్ని రికార్డులు తెలుగు లోనే ఉండాలి. ఇకపై ఈ ఆంధ్ర దేశంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు కనిపించాలి. షాపు ల పేర్లు కూడా ఖచ్చితంగా తెలుగు లో ఉండేలా చేయండి. ప్రతి విద్యార్థి కి తెలుగు అవసరం అడుగడుగునా కనిపించాలి. అప్పుడే తెలుగు భాష అంతరించిపోకుండా ఉంటుంది. నేను తెలుగు మీడియం లో ఇంగ్లీషు ఒక సబ్జెక్టు గా చదివాను. ఇంగ్లీషు అవసరం కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను ఇంగ్లీషు ని నెగ్లెట్ చేసాను. కొందరు ఇంగ్లీషు మీడియం మితృలు "మాకు అస్సలు తెలుగు రాదు" అన్నట్లు ప్రవర్తించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి