కాలం రాబోతోంది...

NVR entertainments











విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దిగువ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది వేసవి కాలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. వేసవి కాలం లో పండే "జీడి మామిడి" పంట వీరికి ప్రధానమైనది చెప్పవచ్చు. జీడి మామిడి పంట పై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ వేసవిలో సంపాదించిన దానితోనే సంవత్సరం మొత్తం గడుపుతారు. దళారీల వద్ద అప్పులు చేసి గిరిజన ప్రజలు బ్రతుకుతున్నారు. 2018 వరకు వీరి జీవనం బాగానే గడిచింది. గత ఏడాది జీడి పిక్క ధర అందరినీ నిరాశ పరిచింది. ఎన్నో కుటుంబాలు అప్పులపాలై గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం విశాఖ మన్యం దిగువ ప్రాంతంలో కనిపిస్తుంది. జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్న, జీడిపప్పు ఉండే పిక్క ధర మాత్రం గత ఏడాది జీడి మామిడి రైతులు అందరినీ నిరాశ పరిచింది. దీనికి కారణం గత ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు కారణంగా ప్రభుత్వం లేకపోవడం వలన అని అభిప్రాయపడి, మల్లీ ఈ సంవత్సరం కూడా జీడి మామిడి పంట సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు దిగువ ఏజెన్సీ రైతులు. "రైతు దేశానికి వెన్నెముక అంటారు" కానీ, ఆ రైతుల కష్టాలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఈ సంవత్సరం జీడి మామిడి పిక్క ధర రైతులకు అనుకూలంగా ఉంటుందని, రైతులు ఆనందంగా ఉంటారని ఆశిద్దాం.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గణతంత్ర దినోత్సవం

డోలీ మోతకు చెక్