మద్యం పై కన్నెర్ర



విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా మన్యం లో చాలా కాలం నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నాటుసారా తయారీ చేస్తున్నారు. దీనిపై మన్యం లో పలు గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించి, పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు లో ఎక్సైజ్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మినుములూరు పంచాయతీ లో దాడులు నిర్వహించి, ఎక్సైజ్ సిబ్బంది 1900 లీటర్ల బెల్లపు పులుపు ధ్వంసం చేశారు. కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ లో ఎస్సై నాగేంద్ర ఆధ్వర్యంలో  మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘ సభ్యులు, వాలంటీర్లు దాడులు నిర్వహించారు. 25 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఇది ఇలా ఉంటే, తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు లో అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్న వారి ఆటకట్టించారు ఓ మహిళా పోలీస్ అధికారిని. సముద్ర తీరంలోని కరువాక గ్రామంలో అనధికార మద్యం హల్ చల్ చేస్తోంది. విషయం తెలుసుకున్న సచివాలయ మహిళా పోలీస్ అధికారిని సోమవారం ఆ ఇంటి పై దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు అడ్డం వచ్చిన లెక్క చేయకుండా  ఎదురించి మరీ దాడి చేశారు మహిళా పోలీస్ అధికారిని ధన్యశ్రీ. అండగా నిలిచిన సచివాలయ సిబ్బంది. 22 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, నగరంలో పోలీసులకు సమాచారం అందించారు. మద్యం పై మహిళా పోలీస్ అధికారినిల తెగువ అభినందనీయం. సోషల్ మీడియాలో, ఆయా ప్రాంతాల్లో మహిళా పోలీస్ అధికారినుల ధైర్యసాహసాలకు ప్రశంశలు అందుకుంటున్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గణతంత్ర దినోత్సవం

కాలం రాబోతోంది...

డోలీ మోతకు చెక్