డోలీ మోతకు చెక్
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లాలో సగభాగం ఏజెన్సీ ప్రాంతమే. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో 245 పంచాయతీలు, వాటిలో 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన గ్రామాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సౌకర్యాలు ఉండవు. మరికొన్ని గ్రామాల్లో మార్గమే లేని పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నారు అమాయక గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ. చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాల సదుపాయం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, బాలింతలను తీసుకుని వెళ్ళాలన్నా డోలీ కట్టి మోసుకుని వెళ్ళాల్సిందే. ఈ డోలీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి గ్రామాల్లో నివశించే గిరిజన ప్రజల చిరకాల వాంఛ "రోడ్డు". అనేక సార్లు ఎన్నో గ్రామాల గిరిజన ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను మా గ్రామానికి దారి చూపండి అంటూ రోడ్డు కావాలని అడిగారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికీ అడుగుతున్నారు, వినతి పత్రాలు ...