JVS BHASKAR about DONATE A MEAL మేము చేస్తున్న DONATE A MEAL FOR NEEDY కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, మరింత విజయవంతం కావాలని, మోటివేషనల్ స్పీకర్ (Impact) శ్రీ జె.వి.యస్ భాస్కర్ గారు తన కొత్త యూట్యూబ్ చానల్ ద్వారా వ్యక్తం చేశారు. మనం చేస్తున్న మంచి పనికి ఇంత గొప్ప ఆదరణ లభించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే ఉత్సాహంతో మరింత మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తాము. మీ అందరి సహకారం వల్లే, మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతున్నాము. ఇకపై కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మరింత మంది సహకారం అవసరం. అందుకోసం మనం ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేసి, *అన్నార్తుల ఆకలి తీర్చుదాం... కూలీల కడుపులు నింపుదాం...* మానవత్వమే మనిషికి రూపం.. మనిషి గా మరో మనిషికి సాయం చేద్దాం... YouTube అన్నార్తులను ఆదుకుందాం... మానవత్వం చాటుకుందాం... 🙏🙏🙏 Please support us...
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లాలో సగభాగం ఏజెన్సీ ప్రాంతమే. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో 245 పంచాయతీలు, వాటిలో 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన గ్రామాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సౌకర్యాలు ఉండవు. మరికొన్ని గ్రామాల్లో మార్గమే లేని పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నారు అమాయక గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ. చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాల సదుపాయం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, బాలింతలను తీసుకుని వెళ్ళాలన్నా డోలీ కట్టి మోసుకుని వెళ్ళాల్సిందే. ఈ డోలీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి గ్రామాల్లో నివశించే గిరిజన ప్రజల చిరకాల వాంఛ "రోడ్డు". అనేక సార్లు ఎన్నో గ్రామాల గిరిజన ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను మా గ్రామానికి దారి చూపండి అంటూ రోడ్డు కావాలని అడిగారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికీ అడుగుతున్నారు, వినతి పత్రాలు ...
రాజు పెన్సిల్ ఆర్ట్స్ romeoraju70@gmail.com తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి చెందిన రాజు అనే యువకుడు తన ప్రతిభను చాటుకున్నారు. సంప్రదించండి ఇలా...... https://youtu.be/_bd6X2tGxM8 https://youtu.be/_bd6X2tGxM8
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి