కరోనా మహమ్మారి వలన పస్తులుంటున్న ఎందరో పేదవారికి, అగ్గి లాంటి ఎండ ధాటికి ఎటు పోవాలో తెలీని..నిలువ నీడ లేని నిర్భాగ్యులకి, ఇప్పుడు తింటే మళ్లీ ఎప్పుడు తింటామో తెలియని అభాగ్యులకి, దేశ సేవ లో నిమగ్నమైన పోలీసులకి, sanitary సిబ్బందికి, *Phase - 1గా ఈరోజు మన డైట్ కామ్రేడ్స్ తరపున ఒక చిన్న ప్రయత్నం ద్వారా రాజమండ్రిలో 28 మందికి వెజ్ బిర్యాని, ఆలూ కుర్మా, మజ్జిగ, బిస్కెట్ పాకెట్స్ అందించడమైనది* ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం... *ఈపూట బానే గడిచింది అని సంతోష పడుతూనే, ఇంకొక పూట ఎలా గడుస్తుందో అని బాధ పడుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు..* *తమ కష్టాన్ని నమ్ముకున్న రోజు వారి కూలీలు, ఆత్మాభిమానం తో బ్రతికే కార్మికులకు మాత్రం ఏం తెలుసు ఇటువంటి గడ్డు కాలం వస్తుందని...*! *తమ ఆకలి తీర్చడానికి ఎవరో వస్తారు..తినడానికి ఏదో ఇస్తారు అని ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎదురు చూసే రోజులను తెస్తుందని...*!! ఆకలి వల్ల ఆత్మాభిమానాన్ని చంపుకున్న వారు కొందరైతే, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆకలితో బాధ పడే వారు ఇంకొందరు.... వీళ్లంతా ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా... ఎక్క...